ఇయ్యాల  ప్రియాంక సభ.. సరూర్​నగర్ స్టేడియంలో నిర్వహణ

ఇయ్యాల  ప్రియాంక సభ.. సరూర్​నగర్ స్టేడియంలో నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: సరూర్​నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా సోమవారం నిర్వహించనున్న ‘యువ సంఘర్షణ సభ’కు కాంగ్రెస్ లీడర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు ప్రియాంకా గాంధీ చీఫ్ గెస్ట్​గా హాజరవుతున్నారు.

నిరుద్యోగులు, స్టూడెంట్స్, యువతే లక్ష్యంగా నిర్వహించే ఈ సభలో ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రియాంక ప్రకటిస్తారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్ రావ్‌‌‌‌ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ సహా పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు.

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం, నిరుద్యోగం, యువత పడుతున్న బాధలపై సర్కారు లక్ష్యంగా కాంగ్రెస్ ఈ సభను నిర్వహిస్తున్నది.