
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర ప్రారంభ వేదికలో మార్పు జరిగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని హప్తా కాంగ్జీబంగ్ నుంచి ఈ యాత్ర ప్రారంభించాల్సి ఉండగా... అక్కడి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రారంభ వేదికను మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తౌబల్ జిల్లాలోని ఖోంగ్జోమ్ గ్రామం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
2024 జనవరి 14న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మొదలై 66 రోజులు పాటి సాగి గుజరాత్ లోని మహత్మా గాంధీ పుట్టిన ఊరైన పోరుబందర్ వద్ద మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారు.
భారత్ జోడో న్యాయ యాత్ర ఇలా..
- మణిపూర్‌లోని 4 జిల్లాలు, 2 లోక్‌సభ, 11 అసెంబ్లీలను కవర్ చేస్తుంది
- నాగాలాండ్‌లో 257 కిలోమీటర్లు, 5 జిల్లాలు 2 రోజుల్లో కవర్ చేయబడతాయి.
- అస్సాంలో 833 కిలోమీటర్లు, 17 జిల్లాల్లో 8 రోజుల పాటు సాగుతుంది.
- పశ్చిమ బెంగాల్‌లో 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 రోజుల్లో 523 కి.మీ.
- జార్ఖండ్‌లో 8 రోజుల్లో 13 జిల్లాల్లో 804 కి.మీ.
- ఒడిశాలో 4 జిల్లాల్లో 4 రోజుల్లో 341 కి.మీ.
- బీహార్‌లో 7 జిల్లాల్లో 4 రోజుల్లో 425 కి.మీ.
- యూపీలోని 10 జిల్లాల్లో 11 రోజుల్లో గరిష్టంగా 1074 కి.మీ.
- ఛత్తీస్‌గఢ్‌లో 7 జిల్లాల్లో 5 రోజుల్లో 436 కి.మీ.
- గుజరాత్‌లో 7 జిల్లాల్లో 5 రోజుల్లో 445 కి.మీ.
- రాజస్థాన్‌లో 2 జిల్లాల్లో ఒకేరోజు 128 కి.మీ.
- మహారాష్ట్రలో 7 జిల్లాల్లో 5 రోజుల్లో 480 కి.మీ.