అసమ్మతి నేతలతో సోనియా భేటీ

అసమ్మతి నేతలతో సోనియా భేటీ

బిహార్ ఎన్నికల్లో  ఘోర పరాజయం  తర్వాత  అసమ్మతి  తెలిపిన  సీనియర్ నేతలతో భేటీ  అయ్యారు  కాంగ్రెస్  అధినేత్రి సోనియాగాంధీ.  ఢిల్లీలోని  తన ఇంట్లో… పార్టీ సీనియర్లు,  అసమ్మతి నేతలతో   సోనియాగాంధీ  సమావేశం అయ్యారు . భేటీలో  రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ, అంబికా సోనీ,  చిదంబరం,  గులాంనబీ  ఆజాద్, ఆనంద్ శర్మ, అశోక్ గెహ్లాట్  పాల్గొన్నారు. గతంలో  పార్టీ నాయకత్వంపై  అసంతృప్తి వ్యక్తం   చేసిన నేతలు మీటింగ్ కు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీకి  తాత్కాలిక అధ్యక్షుడు  కాకుండా  చురుకైన నాయకత్వం  కావాలనీ ప్రస్తుత నాయకత్వం  మార్చాలని  ఆగస్ట్ నెలలో  సోనియాకు  23 మంది  అసమ్మతి నేతలు లెటర్ రాశారు. బీహార్  ఎన్నికల్లో ఘోర  పరాజయం  తరువాత  పార్టీపై  కపిల్ సిబల్, చిదంబరం సహా కొందరు  నేతలు  అసంతృప్తి తెలిపారు.  ఆరోగ్యం కుదుట  పడ్డాక.. నాలుగు నెలల తరువాత కాంగ్రెస్  సీనియర్లతో  భేటీ అయ్యారు  సోనియాగాంధీ.

పార్టీ కొత్త  అధ్యక్షుడి ఎంపిక,   సంస్థాగత ఎన్నికలు , పార్టీ బలోపేతం  సహా  కీలక అంశాలపై సీనియర్  నేతలతో  సోనియాగాంధీ  చర్చిస్తున్నారు. సోనియాగాంధీ  రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్  మరణం తర్వాత  జరుగుతున్న తొలి  సమావేశం ఇది.  మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  కమల్ నాథ్  బాధ్యత తీసుకోవడంతో..  అసమ్మతి నేతలు సోనియాగాంధీతో సమావేశం  అయ్యారు. రాజకీయ ,సంస్థాగత అంశాలపై  సీనియర్లు,  అసంతృప్తులను భాగస్వామ్యం  చేయాలని  సోనియాగాంధీ భావిస్తున్నారు.