పదేండ్లుగా ప్రజలు దగా పడ్తున్నరు : మాణిక్​ రావు ఠాక్రే

పదేండ్లుగా ప్రజలు దగా పడ్తున్నరు : మాణిక్​ రావు ఠాక్రే
  • కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్​ రావు ఠాక్రే

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రమిస్తే తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందనుకున్నామని, కానీ ప్రజలు పదేండ్లుగా అడుగడుగునా దగా పడుతున్నారని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావు ఠాక్రే అన్నారు. తెలంగాణ కోసం 1,200 మంది యువత తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. సోమవారం ఆయన పలువురు ఉద్యమ నాయకులతో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్​ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

ALSO READ : పీఎఫ్​ వడ్డీ త్వరలోనే వేస్తం

తెలంగాణ నిర్మాణం కోసం సోనియా గాంధీ మాటిచ్చారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్​లో 60 శాతం కేసీఆర్​ కుటుంబం జేబుల్లోనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లనో రాలేదని తెలంగాణ విఠల్​ అన్నారు. త్యాగాలేమో ప్రజలవని, భోగాలు మాత్రం కేసీఆర్​ కుటుంబం అనుభవిస్తున్నదని మండిపడ్డారు. దంచుడే దించుడే నినాదంతో పౌర సమాజంతో కలిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు.