తిరుమల కొండపై మోదీ చేసిన తప్పేంటీ.. ఎందుకు ఆయన అలా అన్నారు..?

తిరుమల కొండపై మోదీ చేసిన తప్పేంటీ.. ఎందుకు ఆయన అలా అన్నారు..?

ప్రధాని మోదీ ఇటీవల తిరుమల కొండకు వెళ్లారు.. వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.. స్వామి మూల విరాట్ కు మొక్కారు.. ప్రత్యేక పూజలు చేశారు.. పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.. సంప్రదాయ దుస్తుల్లో ఇవన్నీ చేశారు మోదీ.. అయితే తిరుమలలో ప్రధాని మోదీ దర్శనంతోపాటు ఆయన వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తుంది.. మోదీ.. నిన్ను ఏ వేంకటేశ్వరస్వామి కూడా క్షమించరు అంటూ శాపనార్థాలు పెడుతుంది.. దీనికి కారణం ఏంటో చూద్దామా.. 

ప్రధాని మోదీ తిరుమల కొండపై ఉన్నప్పుడు ఆయన ఫొటోలు, వీడియోలు తీయటానికి ప్రత్యేక సిబ్బందిని తీసుకెళ్లారు. వాళ్లు మోదీ ముందూ.. వెనకా ఉన్నారు.. మోదీ ప్రతి అడుగును తమ కెమెరాల్లో బంధించారు. ఈ విషయాన్నే ఫొటోలతో సహా ఎత్తి చూపుతుంది కాంగ్రెస్ పార్టీ. మోదీ దర్శనానికి వెళుతున్నప్పుడు.. బయటకు వచ్చినప్పుడు ముందూ వెనకా ఉన్న ఫొటోగ్రాఫర్లకు సంబంధించిన ఫొటోను.. ఎక్స్ లో పోస్టు చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్.. చివరకు వేంకటేశ్వరస్వామిని కూడా వదిలిపెట్టలేదా.. మీకు తగిన గుణపాఠం చెబుతారు ఆ స్వామి.. గోవిందా.. గోవిందా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

మొన్నటికి మొన్న బెంగళూరులోని తేజాస్ యుద్ధ విమానంలో ప్రయాణించినప్పుడు కూడా.. గాల్లో ఉన్నప్పుడు కూడా మోదీ చేతులు ఊపుతూ కనిపించారని.. ఆకాశంలో ఎవరికి చేతులు ఊపుతున్నారంటూ చురకలు అంటించారు జయరాం రమేష్. 

ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై రాజకీయాలు, ప్రచారంపై నిషేధం ఉందని.. అలాంటి చోట కూడా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లతో మోదీ ప్రచారం చేసుకోవటాన్ని తప్పుబట్టింది. జయరాం రమేష్ పోస్ట్ వైరల్ కావటం.. చర్చనీయాంశం అయ్యింది.