మోడీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ… భారత్ బచావో ర్యాలీకి శ్రీకారం చుట్టింది. ఇవాళ రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా….కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు సహా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, ఆర్థిక అస్తవ్యస్తత ఇలాంటి అంశాలపై దశలవారీ పోరాటానికి కాంగ్రెస్ రెడీ అయింది. సభ జరిగే స్థలంలో బ్లాక్ బెలూన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
Delhi: Preparations underway at Ramlila Maidan where Congress is organising 'Bharat Bachao' rally today. pic.twitter.com/nRvz8RHcJV
— ANI (@ANI) December 14, 2019
