హైదరాబాద్, వెలుగు: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ కూడబెట్టిన అక్రమ ఆస్తులపై రాష్ట్రంలోని ఊరూరా డప్పు చాటింపు వేయిస్తామని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ అక్రమ ఆస్తులను బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో చేపడుతామని చెప్పారు.
కేటీఆర్ అక్రమ ఆస్తులను సీఎం రేవంత్ రెడ్డి బయటపెడితే.. నా ఆస్తులకు సీఎం ప్రచారం కల్పించినందుకు థాంక్స్ అని కేటీఆర్ అనడం ఆయనలోని రాక్షసానందానికి నిదర్శనమని మండిపడ్డారు. సిరిసిల్ల సభతో కేటీఆర్ తెల్లమొహం వేశారని, రాబోయే ఎన్నికల్లో అక్కడి ప్రజలు కేటీఆర్ కు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు .
