అమిత్ షా భయపడి గల్లీ బాట పడుతున్నారు..అద్దంకి దయాకర్ ఫైర్

అమిత్ షా భయపడి గల్లీ బాట పడుతున్నారు..అద్దంకి దయాకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ క్యాడర్ ఢిల్లీ బాట పడుతుంటే, ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్ షా భయపడి గల్లీ బాట పడుతున్నారని విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ‘లోక్‌తంత్ర బచావో’ పేరుతో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తన పాదయాత్రకు విచిత్రమైన పేరు పెట్టారని ఆరోపించారు.

అమిత్ షా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై పాదయాత్ర చేయడానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్‌పీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్న ఆయన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వాళ్లే దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.