మహబూబ్నగర్ లో 58వ డివిజన్ ఏకగ్రీవం

మహబూబ్నగర్ లో 58వ డివిజన్ ఏకగ్రీవం

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ అర్బన్, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లు ఉండగా, 58వ డివిజన్ ఏకగ్రీవమైంది. ఈ స్థానం జనరల్ విమెన్‌‌‌‌‌‌‌‌కు రిజర్వ్ కాగా, కాంగ్రెస్ తరఫున మాజీ కౌన్సిలర్ బి.రమాదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానానికి బీఆర్ఎస్ నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోగా, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థి కూడా విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవడంతో రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కమిషనర్ ఆమెకు నియామకపత్రం  అందజేశారు.