
హైదరాబాద్, వెలుగు: తమ పార్టీ మండల కమిటీలను ఈ నెలాఖరునాటికి ఖరారు చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్లో పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ రాచరిక, అవినీతి పాలనను రాష్ట్ర ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, డిజిటల్మెంబర్ షిప్ను వాడుకోవాలని చెప్పారు. రాష్ట్రానికి కొత్త ఏఐసీసీ ఇన్ చార్జి సెక్రటరీలుగా విష్ణునాథన్, యువ నాయకుడు మన్సూర్ అలీ వస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు తెలంగాణ సంపదను లూటీ చేస్తున్నారని మహేశ్ ఆరోపించారు.