జ్యోతిష్యం : ధనస్సు రాశిలోకి శుక్రుడు .. ఈ 5 రాశులకు చాలా బాగుంటుంది.. మిగతా వారికి ఎలా ఉంటుందంటే..!

జ్యోతిష్యం : ధనస్సు రాశిలోకి శుక్రుడు .. ఈ 5 రాశులకు చాలా బాగుంటుంది.. మిగతా వారికి ఎలా ఉంటుందంటే..!

జ్యోతిష్యం ప్రకారం  నవగ్రహాల్లో శుక్రు గ్రహానికి చాలా విశిష్టత ఉంది.  ఆర్ధిక సమస్యలు ఉన్నాయంటే వారి జాతకంలో శుక్ర బలం వీక్​ గా ఉందని పండితులు చెబుతున్నారు. ఐశ్యర్యం ... సంతోషం విషయంలో కీలక పాత్ర పోషించే శుక్రుడు 2025 డిసెంబర్​ 20 వ తేది .. ఉదయం 7.50 గంటలకు ధనస్సు రాశిలో ప్రవేశించనున్నాడు.  దీనివలన  ఐదు రాశుల( మేషం,  సింహ, తుల, ధనస్సు, కుంభ)  వారికి చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు.  మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

మేష రాశి:  శుక్రుడు ధనస్సురాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి  ఎంతో కాలంగా పెండింగ్​ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునేవారికి  ఈ సమయం అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన విదేశీ అవకాశాలు లభిస్తాయి. శుక్రుడికి బలం పెరిగి మనసులోని కోరికలు, ఆశలను చాలావరకు నెరవేరతాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టేఅవకాశం ఉంది.  విదేశాల్లో పని చేసే వారికి కొత్త కాంట్రాక్టులకు సంబంధించి శుభవార్త వింటారు. 

వృషభ రాశి:  ధనస్సు రాశిలో శుక్రుడి ప్రవేశం ఈ రాశి వారికి  మరింత అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలుగుతుంది. గతంలో రావలసిన అప్పులు...  నిలిచిపోయిన బకాయిలు చేతికి అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో పాటు పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. . కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి.  చిన్న పెట్టుబడులు కూడా లాభాలుగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్త వినే  అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. . 

మిధునరాశి: ఈరాశివారికి  ధనస్సు రాశిలో శుక్రుని సంచారం  వలన శుభప్రదం అవుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో లాభసాటి అవకాశాలు ఏర్పడతాయి.మీ మీరు పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.  జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. . మనసులోని కోరికలు నెరవేరుతాయి. అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో అనుకోకుండా ప్రేమలో పడడం గానీ, పెళ్లి కావడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి.

కర్కాటకరాశి: శుక్రుడు ధనస్సు రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి  కొన్ని ఇబ్బందులు ..చికాకులు ఉంటాయి.  ప్రతి పనిలో కూడా ఆలస్యం జరుగుతుంది.  ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఏ పని చేయాలో తెలియని పరిస్థితులు   ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన  పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులు  కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.  ప్రతి విషయంలో ఓర్పు సహనంతో ఉండండి. కాల క్రమేణ అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. 

సింహ రాశి: ధనస్సు రాశిలో శుక్రుడు సంచారం..ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు తాము చేసిన పనికి సీనియర్లు, జూనియర్ల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులు తెరచుకుంటాయి. ఈ కాలంలో ఎదురయ్యే చిన్న చిన్నసమస్యలతో మీ భాగస్వామి సాయంతో సులభంగా పరిష్కరించుకుంటారు. ఈ కాలంలో మీరు ధైర్యంగా ఉండటం కారణంగా క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. రావాల్సిన డబ్బును పొందే అవకాశం ఉంది.  గతంలో నిలిచిపోయిన పెట్టుబడుల లాభాలను ఇప్పుడు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అకలసి వస్తాయి.  చేతి వృత్తుల వారికి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. 

కన్యారాశి: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వలన ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. సొంత ఇల్లు, వాహనం అమరుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశాల్లో స్థిరత్వం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలు పెరుగుతాయి. కొన్ని పనులు  అదృష్టవశాత్తూ  పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.  వ్యాపారాల్లో మంచి ప్రణాళికలు వేస్తారు. పోటీదారుల నుంచి ఎదురయ్యే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  పెళ్లి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.   
             
తులా రాశి:  శుక్రుడు ధనస్సు రాశిలో సంచారం వలన ఈ రాశి వారి  జీవితం మరింత సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. . గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడులు తగ్గి ఆదాయంలో స్థిరత్వం కలిగే అవకాశం ఉంది.  కొందరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికిచాలా  అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగినా గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారంలో ఉంది. పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు బలపడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి: శుక్రుడు   .. ధనస్సు రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ  రాశి వారికి పనిభారం..ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు  ఎవరితోను వాదన పెట్టుకోకుండా.. వారి పని వారు చేసుకోండి. ఆరోగ్య విషయంలో అనుకోని ఇబ్బందులు రావడంతో  డబ్బు ఖర్చవుతుంది. ఊహించని నష్టాలు వచ్చే ప్రమాదం ఉన్నందున మీ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

ధనుస్సు రాశి : ఇదే రాశిలో శుక్రుడు సంచారం వలన ఈ  కాలం మరింత ప్రత్యేకంగా మారనుంది. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంలో సానుకూల మార్పులు  కలుగుతాయి. ప్రేమ సంబంధాల్లో స్పష్టత పెరిగి భావోద్వేగ పరంగా సంతృప్తి కలుగుతుంది.  పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసే వారు శుభవార్తలు వింటారు. కెరీర్​ విషయంలో  కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి అనుకూల ఫలితాలు రావచ్చని చెబుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి విస్తరణకు అవకాశాలు కనిపించవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద విజయం సాధించి బిజీగా పురోగమించడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి విస్తరిస్తుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గి స్థిరమైన పరిస్థితి ఏర్పడుతుందని పండితులు విశ్లేషిస్తున్నారు.

మకరరాశి .. ఈ రాశి వారికి శుక్రుడు.. ధనస్సు రాశిలో ప్రవేశం అంత అనుకూలంగా ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   వ్యాపారస్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడుతాయి.  ఆరోగ్యపరంగా సమస్యలు.. మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి ఏర్పడుతాయి. ఈ రాశి వారు ఎవరితో ఎలాంటి వాదన పెట్టుకోవద్దు.  ఆర్థికంగా ఇబ్బందులు పడినా... సమయానికి చేతికి డబ్బుఅందుతుంది.  అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రేమ.. పెళ్లి విషయాల్లో ప్రతికూల ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

కుంభ రాశి : శుక్రుడు.. ధనస్సు రాశిలో సంచారం వలన  ఈ రాశి వారికి నాయకత్వ సామర్ద్యాలు అభివృద్ది చెందుతాయి.  కెరీర్ స్థిరత్వాన్ని కోరుకున్న వారు ఇప్పుడు మంచి పురోగతిని చూస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి కొత్త కాంట్రాక్టులు, నెట్ వర్కింగ్ అవకాశాలు ఏర్పడతాయి.కార్యాలయంలో   సానుకూల మార్పు లు కలుగుతాయి.  మీరే కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ బాధ్యత మీ చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

మీనరాశి: ధనస్సురాశిలో .. శుక్ర గ్రహ సంచారంతో   ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కేరీర్​లో హెచ్చు తగ్గులుంటాయి.  అయినా మీ పనితీరుతో  అధికారులు బాగా సంతృప్తి చెందుతారు. పెండింగ్​ లో ఉన్న ప్రాజెక్ట్​లను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆరోగ్య పరంగా, తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా దంత మరియు కంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.