ఫోన్ ట్యాపింగ్ : ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుతో... ఫోన్ ట్యాపింగ్కు లింక్ ఉందా..?

ఫోన్ ట్యాపింగ్ : ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుతో... ఫోన్ ట్యాపింగ్కు లింక్ ఉందా..?

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఓ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు మరో కేసు పునాధులు కదులుతుండటంతో అవాక్కవుతున్నారు. విచారణ లోతు పెంచుతా ఉంటే రోజుకు నలుగురి పేర్లు బయటడుతూ విస్తృత పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ కు ముడిపడింది. ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్ లో బీ ఎల్ సంతోష్, తుషార్ కోసం ఎస్ఐబీ అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్ళారు. అక్కడికి వెళ్లేందుకు స్పెషల్ ఫ్లైట్స్ వినియోగించారు. వినియోగించిన స్పెషల్ ఫ్లైట్స్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేతకు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. 

స్పెషల్ ఫ్లైట్ ను అక్రమంగా వాడుకున్నట్టు గుర్తించారు. అధికారులకు విమానం ఎందుకు ఇచ్చారని ఫ్లైట్ ఓనర్ ను పోలీసులు విచరించనున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిన అధికారులు ఎవరా అనే విషయం పై ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోళ్లతో లింక్ ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.