కరోనా తో కానిస్టేబుల్ మృతి.. అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్థులు

కరోనా తో కానిస్టేబుల్ మృతి.. అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్థులు

కంభం: కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేస్తే తమకు కూడా కరోనా వస్తదని ప్రజల్లో అపోహ ఉంది. దీంతో చాలా చోట్ల కరోనా మృతుల అంత్యక్రియలు చేసేందుకు స్థానికులు అడ్డు చెప్తున్నారు. ఇలాంటి ఘటనే ప్రకాశంజిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లా అర్దవీడు మండలం బొల్లుప్లలె గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామానికి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించుకుని ఒంగోలులోని హాస్పిటల్‌లో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోగా.,. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించేందుకు అడ్డుపడ్డారు.అంత్యక్రియలు చేసేందుకు వీలు లేదని ఆందోళన చేశారు. దీంతో రంగంలోకి దిగిని అర్దవీడు ఎస్సై సాంబశివరాలు గ్రామస్థులతో మాట్లాడి అంత్యక్రియలు చేశారు.