
రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష ప్రారంభమైంది. ఇవాళ(ఆదివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాత పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఈ సమయంలో సివిల్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గం టల వరకు టెక్నికల్ పేపర్ తుది రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షల నిర్వహణకు 188 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు 1,05,094 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.