
- కొడంగల్‌లో 220 పడకల హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెరగాలి
కొడంగల్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. వికారాబాద్ జిల్లాకొడంగల్లో 220 పడకల హాస్పిటల్నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధింత ఇంజినీరింగ్ అధికారులను అదేశించారు. ఆసుపత్రికి వైద్యం కోసం రోజువారీగా వస్తున్న వారి వివరాలు, నిర్వహిస్తున్న ప్రసవాల సంఖ్యపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
నర్సింగ్ కాలేజీలు, వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు బ్రెక్ఫాస్ట్అందిస్తున్న హరే కృష్ణ ట్రస్ట్సెంట్రలైజ్డ్కిచెన్ను సీఎస్ సందర్శించారు. కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, కడా స్పెషల్ఆఫీసర్వెంకట్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్విజయ్కుమార్, మున్సిపల్కమిషనర్ బలరాం నాయక్, ఎంపీడీఓ ఉషశ్రీ ఉన్నారు.
వికారాబాద్: ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులు పని చేయాలని చీఫ్‌సెక్రటరీ రామకృష్ణారావు సూచించారు. కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ శాఖల పనితీరు, చేపట్టాల్సిన వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా పారిశుధ్య వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.