
నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్(ఎన్హెచ్ఎస్ఆర్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 21.
పోస్టులు: కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి బి.కాం లేదా బీఏ లేదా బీబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐఎన్జీవో లేగా ప్రభుత్వ సంస్థలోని సామాజిక విభాగంలో హెచ్ఆర్ నిర్వహణలో ఐదేండ్ల పని అనుభవం ఉండాలి.
గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంబీబీఎస్, డెంటల్, ఆయూష్ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు రెండేండ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా లేదా పబ్లిక్ హెల్త్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 28 .
లాస్ట్ డేట్: జులై 21.
సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు
నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్(ఎన్హెచ్ఎస్ఆర్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 22.
పోస్టులు: కన్సల్టెంట్ 01, సీనియర్ కన్సల్టెంట్ 03
ఎలిజిబిలిటీ: సీనియర్ కన్సల్టెంట్‌కు పబ్లిక్ హెల్త్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనిటీ హెల్త్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
కన్సల్టెంట్‌కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ హెల్త్ లేదా ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా హయ్యర్ క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 26.
లాస్ట్ డేట్: జులై 22. పూర్తి వివరాలకు nhsrcindia.org వెబ్సైట్లో చూడగలరు.