ఈ ప్రాంతాల్లో మద్యం తాగితే 10 వేలు ఫైన్

ఈ ప్రాంతాల్లో మద్యం తాగితే 10 వేలు ఫైన్

పర్యాటకులు, బిజినెస్ మ్యాన్ కోసం ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లను 24 గంటలు ఓపెన్ చేయాలని ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా పర్యాటకులకు డ్రింకర్స్ వల్ల ఇబ్బంది కలగకూడదని ఆ రాష్ట్ర సర్కార్ ఓ తీర్మానం చేసింది. రాష్ట్రంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో మద్యం తాగడంపై నిషేధం విధించింది.
మహారాష్ట్రలోని ప్రాచీన కోటల దగ్గర మద్యం తాగితే 10 వేల రూపాయలు ఫైన్ వేస్తామని ఆ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఆల్కహాల్ తీసుకోకూడదన్న నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది.