ఆడియన్స్ చేసిన తప్పు వల్ల ఓ కంటెస్టెంట్ ఏకంగా రూ.6.50 లక్షలు కోల్పోయాడు. ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్ పతి లో పాల్గొన్న ఓ వ్యక్తి ఆడియన్స్ పై నమ్మకంతో వారు చెప్పిన సమాధానాన్ని ఫిక్స్ చేశాడు. ఆ సమాధానం కాస్తా తప్పు కావడంతో ఆ కంటెస్టెంట్ ఏకంగా రూ.6.50 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక ఉసూరుమన్నాడు ఆ కంటెస్టెంట్.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బిగ్ బీ అమితాబ్ హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. ఈ షోకు దేశవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు 14 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం 15వ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ కు కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ షోలో ఓం సంజు రైకర్ అనే వ్యక్తి పాల్గొన్నారు. అమితాబ్ సంధించిన ప్రశ్నలకు చాలా సులువుగా సమాదానాలు చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలా రూ.6.50 లక్షలు గెలుచునే స్థానానికి వచ్చాడు. అందుకోసం అమితాబ్ సంజు రైకర్ ను ఒక కష్టమైన ప్రశ్న అడిగారు . ఆ ప్రశ్న ఏంటంటే.. జంతు రాజ్యంలో ఏ జంతు జాతికి అతి పెద్ద ఐబాల్ ఉంది? ఆప్షన్స్: ఎ) తిమింగలం బి) లెమర్ సి) స్క్విడ్ డి) గుడ్ల గూబ. ఈ ప్రశ్నకు అయోమయంలో పడిపోయిన సంజు రైకర్.. సమాధానం కోసం ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకున్నాడు.
ఆడియన్స్ ఆప్షన్ డీ ను సూచించడంతో.. సంజు రైకర్ కూడా అదే ఆప్షన్ ను ఫిక్స్ చేశాడు. కానీ ఆ ఆప్షన్ సరైంది కాదని.. సరైన ఆప్షన్ సి అని చెప్పారు అమితాబ్. దీంతో ఆ కంటెస్టెంట్ ఒక్కసారిగా అవాక్కయాడు. అలా ఆడియన్స్ కారణంగా రూ.6.50 లక్షలు గెలుచునే అవకాశం కోల్పోయాడు సంజు రైకర్.
Also Read :- మంగళవారం రివ్యూ.. స్క్రీన్ప్లే తో మాయ చేసిన అజయ్
