పద్మారావునగర్, వెలుగు: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసులు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ తదితర స్టేషన్లలో హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి ప్రయాణికుల సామగ్రిని స్క్రీనింగ్ చేశారు. అనుమానాస్పద లగేజీ, వ్యక్తులు కనిపిస్తే ఆర్పీఎఫ్ లేదా రైల్వే సిబ్బందికి తెలియజేయాలని కోరారు.
మాదాపూర్: దుర్గం చెరువు, హైటెక్‌సిటీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు, ప్రయాణికులకు సూచించారు. మాదాపూర్ అడిషనల్డీసీపీ ఉదయ్‌రెడ్డి, ఏసీపీ శ్రీధర్, ఇన్స్పెక్టర్కృష్ణమోహన్పాల్గొన్నారు.
