బిల్లులు ఇస్తలేరని జీపీకి తాళం వేసిండు

బిల్లులు ఇస్తలేరని జీపీకి తాళం వేసిండు

 చేసిన పనులకు అధికారులు బిల్లులు చెల్లించడం లేదని జీపి బిల్డింగ్ కు ఓ కాంట్రాక్టర్  తాళం వేశాడు . జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాం సాగర్ గ్రామంలో గత సంవత్సరం రూ, 20 లక్షల నిధులతో కొత్త జీపీని నాటి సర్పంచ్ భర్త గంగారావు నిర్మించాడు.  బిల్డింగ్ నిర్మించి పూర్తిచేసినా అధికారులు మాత్రం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఇవాళ ఆయన జీపీకి తాళం వేసి నిరసన తెలిపారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఏడాదిగా ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా బిల్లులు శాంక్షన్ చేయలేదన్నారు.   దీంతో విసిగిపోయి ఇవాళ గ్రామపంచాయతీ ఆఫీస్ కు తాళం వేసి తన నిరసన తెలియజేశాడు. బిల్లులు ఇచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్ తెరిచే ప్రసక్తే లేదని తెలిపాడు. స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న తహశీల్దార్, జీపీ ఇన్ చార్జి కార్యదర్శి ఎవరు కూడా గ్రామం వైపు రావడం లేదన్నారు.

ALSO READ | రూ. 50 కోట్లు స్కాం చేసిండు.. అడిగితే.. సంపుతరా.. సంపుర్రి అంటుండు..