రూ. 50 కోట్లు స్కాం చేసిండు.. అడిగితే.. సంపుతరా.. సంపుర్రి అంటుండు..

రూ. 50 కోట్లు స్కాం చేసిండు.. అడిగితే.. సంపుతరా.. సంపుర్రి అంటుండు..

నల్లగొండ జిల్లాలో నయా స్కాం బయటపడింది. చింతపల్లి మండలంలో మనీష్ ఎంటర్ప్రైజెస్ పేరుతో మనీష్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల నుంచి సేకరించిన సుమారు రూ. 50 కోట్లు ఎగ్గొట్టాడు. ఇదేందని అడిగితే సంపుతరా సంపుర్రి అని దబాయించాడు. వివరాల్లోకి వెళ్తే..   నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో మనీష్ రెడ్డి అనే వ్యక్తి మనిష్ ఎంటర్పైజెస్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. 

అమాయక జనాలకు డిపాజిట్ చేసిన డబ్బుకు డబల్ ఇస్తానంటూ నమ్మించాడు. ముందు వందల రూపాయలతో స్టార్ట్ చేసి మొదలు మంచిగా ఇచ్చాడు. తర్వాత.. తర్వాత.. మనిషి యొక్కఆశను ఎరగా వేసి వేలు.. లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడు. ఏజెంట్లను పెట్టుకొని టార్గెట్లు పెట్టి ఇతర జిల్లాలకు విస్తరించాడు. అలా సుమారు కొన్ని వేల మంది వద్ద రూ. 50 కోట్లు వసూల్ చేసి బోర్డు తిప్పాడు.

 బాధితులు నిలదీయడంతో తట్టుకోలేక తానే పోలీసులకు లోగిపోయి కేసు పెట్టి జైలుకు పంపాలని వేడుకున్నాడు. మనీష్ ను బయటకు తీసుకవచ్చి తామే మాట్లాడుకుంటామని బాధితులు పోలీసుల వద్దకు వెళ్లారు. బయటకు వచ్చిన మనీష్ తన వద్ద రూపాయి లేదని చంపుతారా.. జైలుకు పంపుతారా మీ ఇష్టమని దబాయించాడు. 

బాధితులు మనీష్ మాటలు విని బిత్తర పోయారు. చేసేదేమి లేక పోలీసులు మనీష్ ని తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు  తెలుస్తుంది.