న్యాయం కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టు కోచ్‭లు

న్యాయం కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టు కోచ్‭లు

కాంట్రాక్ట్ కోచ్ లు రోడ్డెక్కారు. మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నా తమను పర్మినెంట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు ఇవ్వడంతో పాటు జీఓ 25కి విరుద్ధంగా అర్హత లేని వారిని కీలక పదవుల్లో కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. రూల్స్ కు వ్యతిరేకంగా కారుణ్య నియామకాలు చేపట్టడాన్ని కోచ్ లు తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని ఉద్యోగపరంగా మానసికంగా క్షోభకు గురు చేస్తున్నారని అన్నారు. జిల్లాలకు ఇప్పటివరకు కనీసం మెయింటెన్స్ గ్రాంట్ కూడా ఇవ్వలేదని కోచ్ లు ఆరోపించారు. స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడానికి ఏండ్లకేండ్ల సమయం ఎందుకని నిలదీశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.