- ముషీరాబాద్‌లో వివాదాస్పదంగా మైనార్టీ ఓట్లు డిలీట్
- బీఎల్ఏ, బీఎల్ఓపై చర్యలకు పీసీసీ
- ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్
- ఫామ్ 7 ఇచ్చిన బాలచందర్‌పై - చిక్కడపల్లి పీఎస్‌లో ఎస్ఐఆర్ ఈఆర్వో ఫిర్యాదు
- ఫామ్ 7 ఇచ్చిన బాలచందర్‌పై చిక్కడపల్లి పీఎస్‌లో ఎస్ఐఆర్ ఈఆర్వో ఫిర్యాదు
ముషీరాబాద్, వెలుగు: జాబితా నుంచి ఓటర్ల పేర్లు తొలగించాలని సంబంధం లేని వ్యక్తి ఫారం7 సమర్పించడాన్ని జీహెచ్ఎంసీ తీవ్రంగా పరిగణించింది. ముషీరాబాద్ లో ఓట్ల తొలగింపు విషయం వివాదస్పదంగా మారిన నేపథ్యంలో అధికారులు సీరియస్అయ్యారు. ఈ విషయంపై ఎస్ఐఆర్ ఈఆర్వో, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చిక్కడపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
బాగ్ లింగంపల్లి బూత్ నంబర్ 210లో మైనార్టీ కుటుంబంలో 31ఓట్లు తొలగించాలని బీజేపీ బీఎల్ఏ (బూత్లెవల్ఏజెంట్) బాలచందర్ ఫామ్ 7 సమర్పించారు. దీనిపై పీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. బీజేపీ బీఎల్ఏ తో పాటు అక్కడి బీఎల్ఓపై చర్యలకు డిమాండ్ చేసింది. స్పందించిన అధికారి సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణకు శ్రీకారం చుట్టిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడంపై బీజేపీ బీఎల్ఏ బాలచందర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎంసీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ మధుబాబు తెలిపారు.
