లవ్ జిహాదీ పేరుతో మతం మారమన్నాడు.. బీహార్ మోడల్ సంచలన కామెంట్స్

లవ్ జిహాదీ పేరుతో మతం మారమన్నాడు.. బీహార్ మోడల్ సంచలన కామెంట్స్

తన్వీర్ అనే వ్యక్తి లవ్ జీహాది పేరుతో మతం మారమని తనను బలవంత పెడుతున్నాడని సంచలన కామెంట్స్ చేసింది బీహార్ మోడల్ మాన్వి. తనతోపాటు మాడలింగ్ ఏజెన్సీలో పనిచేసిన తన్వీర్ గతకొంత కాలంగా తనని ఇబ్బంది పెడుతున్నాడని, మతం మారమని టార్చర్ చేస్తున్నాడని చెప్పింది. ఇక ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పగా వారు పట్టించుకోలేదని, తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించింది మాన్వి. 

ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన మాన్వి.. "తన్వీర్ ముందు నాకు యష్ గా పరిచయమయ్యాడని, తరువాత స్నేహం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. తరువాత కొంతకాలానికి తనని మతం మారమని అడగగా తాను ఒప్పుకోలేదని, దాంతో గొడవ జరిగిందని, అప్పటినుండి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు వివరించింది మాన్వి. అంతేకాదు తన్వీర్ దగ్గర తన పర్సనల్ ఫొటోస్ ఉన్నాయని, మతం మారకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని భయపెట్టాడని, ఒక సమయంలో చంపుతా అని కూడా బెదిరించాడని చెప్పుకొచ్చింది  మాన్వి. ప్రస్తుతం మాన్వి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఈ ఆరోపణల్ని తోసిపుచ్చాడు తన్వీర్.. "తను, మాన్వి ఒక మోడలింగ్ ఏజెన్సీ లో పనిచేవాల్లమని, మాన్వి వల్ల తాను చాలా నష్టపోయానని చెప్పుకొచ్చాడు. ఆ నష్టాన్ని తిరిగి అడిగినందుకే మాన్వి తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని వివరించాడు తన్వీర్. దీంతో ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు ఈ కేసును జార్కండ్ పోలీసులకు బదిలీ చేశారు.