అడుగుపెడితే విజిలే..అంచనాలు పెంచిన కూలీ ట్రైలర్

అడుగుపెడితే  విజిలే..అంచనాలు పెంచిన కూలీ ట్రైలర్

‘ఒకడు పుట్టగానే.. వాడు ఎవడి చేతిలో చావాలన్నది తలమీద రాసిపెట్టి ఉంటది’ అని నాగార్జున చెప్పే  డైలాగ్‌‌‌‌తో ప్రారంభమైన  ‘కూలీ’ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. రజినీకాంత్ హీరోగా ఆమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్‌‌‌‌‌‌‌‌, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో లోకేష్  కనగరాజ్ రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ శనివారం విడుదలైంది. పోర్టు ఏరియాలో కూలీలుగా పనిచేసే 14వేల నాలుగు వందల మందిలో ఒక్క కూలీ కోసం సౌబిన్ షాహిర్‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్ వెతుకుతుంది. అతనే దేవా (రజినీకాంత్).  

నాగార్జున విలన్‌‌‌‌గా పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపిస్తుంటే, ఆమీర్ ఖాన్ గన్స్ పట్టుకుని స్టైలిష్‌‌‌‌గా కనిపించాడు. రజినీకాంత్, సత్యరాజ్ స్నేహితులుగా నటించారని తెలుస్తోంది. సత్యరాజ్ కూతురిగా శ్రుతి హాసన్ కనిపిస్తోంది.  ‘అడుగుపెడితే విజిల్ మోగులే..’ అని రజినీకాంత్ ఎంట్రీకి అనిరుధ్ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఇంప్రెస్ చేసింది.  ‘ఈ దేవ గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావారా’ అంటూ తనదైన మార్క్ యాక్షన్‌‌‌‌తో రజినీకాంత్ అలరించారు.  యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్‌‌‌‌తో పాటు ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌తో  కట్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.  సన్ పిక్చర్స్ సంస్థ  నిర్మించిన ఈ చిత్రం  ఆగస్టు 14న విడుదల కానుంది.