శ్రీశైలం ఘంటా మఠం వద్ద రాగి రేకులు లభ్యం

శ్రీశైలం ఘంటా మఠం వద్ద రాగి రేకులు లభ్యం

కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం ఘంటా మఠం వద్ద రాగి రేకులు లభ్యమైయ్యాయి. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఇటీవల దేవస్థానము పంచమఠాలకు పునర్నిర్మాణ పనులను చేపట్టింది. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం ఘంటామఠ ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా.. వివిధ సైజుల్లో ఉన్న 28 రాగి రేకులు గుప్తనిధి తరహాలో బయటడ్డాయి.

అయితే ఈ రాగిరేకులపై సంస్కృతం, కన్నడ భాషల్లో లిపి ఉంది. విషయం తెలుసుకున్న  అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బయటపడ్డ రాగి రేకులను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు, రెవెన్యూశాఖకు సమాచారాన్ని తెలియజేశామని తెలిపారు ఆలయ అధికారులు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.