చందానగర్, వెలుగు: మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో చందానగర్ పరిధిలోని పాపిరెడ్డికాలనీలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 266 మంది పోలీసులతో 250 ఇండ్లలో సెర్చ్ చేశారు. ఈ ఆపరేషన్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న వారు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించగా, బెల్ట్ షాపుల్లో 635 మద్యం బాటిళ్లు, 122 నిషేధిత విదేశీ సిగరేట్లు, పలు ఇండ్లలో సరైన డాక్యుమెంట్లు, నంబర్ ప్లేట్లు లేని 51 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుర్తింపు లేని 9 మంది అనుమానితులు, నలుగురు రౌడీ షీటర్లను గుర్తించారు. అనంతరం కాలనీవాసులతో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
