డ్రోన్​ కంపెనీలో కోరమాండల్​కు మెజారిటీ వాటా

డ్రోన్​ కంపెనీలో కోరమాండల్​కు మెజారిటీ వాటా

హైదరాబాద్​, వెలుగు: ఫెర్టిలైజర్​ తయారీ రంగంలోని హైదరాబాద్​కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్​ లిమిటెడ్​ డ్రోన్స్​ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే దక్ష అన్​మాన్డ్​సిస్టమ్స్​లో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దక్ష అన్​మాన్డ్ సిస్టమ్స్​లో గతంలోనే 18.34 శాతం కొనేసిన కోరమాండల్​ తాజాగా మరో 32.68 శాతం వాటా కొంది. తన సబ్సిడరీ కోరమాండల్​ టెక్నాలజీ ద్వారా ఈ వాటా కొంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2019 లో చెన్నై కేంద్రంగా దక్ష అన్​మాన్డ్​ సిస్టమ్స్​ఏర్పాటయింది. 

అగ్రికల్చర్​, డిఫెన్స్​, సర్వెలెన్స్​, ఎంటర్​ప్రైజ్​ అప్లికేషన్స్​ను ఈ కంపెనీ అందిస్తోంది. రిమోట్​పైలట్​ ట్రెయినింగ్​ సర్వీసెస్​నూ ఇస్తోంది. ఇప్పటిదాకా 950 మంది పైలట్లకు ట్రెయినింగ్​ను దక్ష ఇచ్చింది. అగ్రికల్చర్​, సర్వెలెన్స్​ అప్లికేషన్స్​ కోసం మూడు డ్రోన్లకు డీజీసీఏ నుంచి టైప్​ సర్టిఫికెట్స్​ను దక్ష పొందింది. దేశంలో ఇవి పొందిన ఏకైక కంపెనీ దక్షనే కావడం విశేషం. పెట్రోల్​ ఇంజిన్​ బేస్డ్​ హైబ్రిడ్​ అగ్రి డ్రోన్స్​ను అందిస్తున్న ఒకే కంపెనీ  ఇదే కావడం విశేషం.