నో కాంటాక్ట్, నో ట్రావెల్ హిస్టరీ.. అయినా కరోనా ఎటాక్

నో కాంటాక్ట్, నో ట్రావెల్ హిస్టరీ.. అయినా కరోనా ఎటాక్

దగ్గు,దమ్మున్న పేషెంట్లలో 104 మందికి వైరస్
ఇందులో 40 మంది ఎక్కడికీ వెళ్లలేదు..ఎవరినీ కలవలేదు
తెలంగాణలో 8.. ఏపీలో 4 కేసులు
ఐసీఎంఆర్ రీసెర్చీ స్టడీలో కొత్త విషయాలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియాలో కొంతమంది ట్రావెల్ హిస్టరీ లేకపోయినా, పాజిటివ్ కేసులతో కాంటాక్ట్‌ ‌ఉండకపోయినా కరోనా బారిన పడుతున్నారని ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకూ 15 రాష్ర్టాల్లోని 36 జిల్లాల్లో ఇలాంటి కేసులు నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. 13 రోజుల్లో శ్వాస సంబంధిత వ్యాధులతో దవాఖాన్లలో చేరిన 4,946 మందికి కరోనా టెస్టులు చేయించగా, వారిలో102 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్టడీ రిపోర్ట్ పేర్కొంది. అంతకుముందు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 19 వరకు 965 మందికి టెస్టులు చేయించగా, ఇద్దరికి మాత్రమే పాజిటివ్‌ ‌వచ్చిందని తెలిపింది.

రాష్ర్టంలో 8 కేసులు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దగ్గు, దమ్మున్న పేషెంట్లు( సివియర్ అక్యూట్‌ ‌రెస్పిరేటరీ ఇల్‌‌నెస్)తో ఎవరొచ్చినా, తమకు తెలియజేయాలని రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే పద్ధతి పాటించారు. దీంతో దేశవ్యాప్తంగా దగ్గు, దమ్ము లక్షణాలున్న 5,911 మంది పేషెంట్లకు కరోనా టెస్టులు చేయించగా 104 మందికి కరోనా పాజిటివ్‌‌ వచ్చిందని ఐసీఎంఆర్ తెలిపింది. మన రాష్ర్టంలో 190 మందికి టెస్ట్ చేస్తే 2 జిల్లాల్లో 8 కేసులు, ఆంధ్రప్రదేశ్‌‌లో 129
మందికి టెస్ట్ చేస్తే రెండు జిల్లాల్లో నలుగురికి వైరస్ పాజిటివ్‌‌ వచ్చింది.

వారెక్కడికీ వెళ్లేలేదు..అయినా
20 రాష్ర్టాల్లోని 104 పాజిటివ్ కేసుల్లో 40 మందికి ఫారిన్‌‌ ట్రావెల్ హిస్టరీ గానీ, పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్గానీ లేదని ఐసీఎంఆర్ గుర్తించింది. ఈ 40 కేసులు 15 రాష్ర్టాలకు చెందిన 36 జిల్లాల్లో నమోదైనట్టు పేర్కొంది. ఆయా రాష్ర్టాలు, జిల్లాల పేర్లను వెల్లడించిన ఐసీఎంఆర్ అక్కడ కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

For More News..

మందు డోర్​ ​డెలివరీ​పేరిట​ భారీగా​ మోసాలు

నో​ కాంటాక్ట్​,​ నో​ ట్రావెల్​​ హిస్టరీ.. అయినా​ కరోనా​ ఎటాక్

100 రోజులు.. లక్ష మరణాలు

5 రోజుల్లోనే 3 వేల కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కట్టడిలో లక్షల జనాభా