కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ నెలలో 182 మందికి పాజిటివ్

కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ నెలలో 182 మందికి పాజిటివ్

తిరువనంతపురం:  కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మే నెలలో ఇప్పటివరకు182 కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొట్టాయంలో అత్యధికంగా 57 కేసులు, ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30, ఇతర జిల్లాల్లో మిగిలిన కేసులు రికార్డ్ అయ్యాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ గురువారం (May 22) మీడియాతో మాట్లాడారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘‘ఆగ్నేయాసియా దేశాలలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేరళలో కూడా కేసులు పెరిగే అవకాశం ఉంది.

కేసుల తీవ్రత అధికంగా లేనప్పటికీ అందరు జాగ్రత్తగా ఉండాలి. నా నేతృత్వంలో స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశాం. ఈ టీమ్ పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు చేపడుతుంది. కరోనా పరీక్షలను పెంచాలని సమావేశంలో నిర్ణయించాం. ఆర్టీపీసీఆర్ కిట్ లు,  మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రులకు సూచించాం” అని ఆమె పేర్కొన్నారు.