రాష్ట్రంలో  స్పీడుగా పెరుగుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో  స్పీడుగా పెరుగుతున్న కరోనా కేసులు
  • వారంలో ఏడింతలు
  • రాష్ట్రంలో  స్పీడుగా పెరుగుతున్న కరోనా కేసులు
  • శుక్రవారం ఒక్క రోజే 2,295 మందికి పాజిటివ్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కరోనా కేసులు యమా స్పీడ్​గా పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లోనే ఏడింతలయ్యాయి. జనవరి 1న 317 మంది దాని బారిన పడితే.. శుక్రవారం ఒక్కరోజే 2,295 మందికి పాజిటివ్​ అని తేలింది. యాక్టివ్​ కేసులూ 10 వేలకు దగ్గర్లోకి వచ్చేశాయి. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో గ్రేటర్​ హైదరాబాద్​లోనే 80 శాతం మంది ఉన్నారు. హైదరాబాద్​ పరిధిలో 1,452 కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత మేడ్చల్​లో 232, రంగారెడ్డి జిల్లాల్లో 218 మందికి కరోనా సోకింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 393 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం విడుదల చేసిన కరోనా బులెటిన్​లో ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసులు 6,89,751కి పెరిగాయి. శుక్రవారం మరో ముగ్గరు కరోనాతో చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 4,039కి చేరింది. వారం క్రితం 3 వేలుగా ఉన్న యాక్టివ్​ కేసులు ఇప్పుడు 9,861కి పెరిగాయి. ఇప్పటిదాకా మహమ్మారి నుంచి 6,75,851 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్​ కేసుల్లో 1,380 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అందులో 555 మంది ఆక్సిజన్​ సపోర్ట్​పై ఉండగా.. 422 మంది ఐసీయూలో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. 

ప్రభుత్వ దవాఖాన్లలో ఫీవర్‌‌‌‌‌‌‌‌ క్లినిక్‌‌‌‌‌‌‌‌లు​
సెకండ్​వేవ్​తో పోలిస్తే ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య చాలా స్పీడ్​గా డబుల్​ అవుతున్నాయి. చిన్న లక్షణాలు కనిపించినా టెస్ట్​ చేయించుకునేందుకు జనాలు మొగ్గు చూపుతున్నారు. రెండు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో 40 వేలకు మించి టెస్టులు చేయలేదు. అయితే, గురువారం 50 వేలు దాటగా, శుక్రవారం 64,474 మందికి టెస్ట్​ చేశారు. ప్రభుత్వ దవాఖాన్లలో ప్రత్యేకంగా ఫీవర్​ క్లినిక్​లను స్టార్ట్​ చేశారు. లక్షణాలున్నోళ్లకు కొన్ని ఆస్పత్రుల్లో హోం ఐసోలేషన్​ కిట్లు ఇవ్వడం కూడా ప్రారంభించారు.