ఏపీలో ఒక్క రోజే 13 వేలకు పైగా కరోనా కేసులు

ఏపీలో ఒక్క రోజే 13 వేలకు పైగా కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ తీవ్రమవుతోంది. కొత్త కేసుల నమోదు ప్రతి రోజూ పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 44,516 టెస్టులు చేయగా.. 13,212 మంది కరోనా పాజిటివ్ అని తేలిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఒక్క రోజులో ఈ వైరస్ కారణంగా ఐదుగురు మరణించారని, దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 14,532కి చేరిందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,942 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల లోడ్ 64,136గా ఉందని ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. కాగా, నిన్న ఒక్క రోజులో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 2,244 కేసులు, ఆ తర్వాత చిత్తూరులో 1585, అనంతపురంలో 1235, శ్రీకాకుళంలో 1230 చొప్పున నమోదైనట్లు పేర్కొన్నారు.


మరోవైపు తెలంగాణలోనూ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 1,20,215 టెస్టులు నిర్వహించగా.. 4,027 మందికి కరోనా సోకినట్లు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,645 మంది కొవిడ్ బారినపడగా.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 380, రంగారెడ్డిలో 336, హనుమకొండలో 154, సంగారెడ్డిలో 107 కేసులు నమోదయ్యాయి. గురువారం 1,825 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.56శాతం కాగా.. రికవరీ రేటు 95.75 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం..

అప్పుల భారంతో మరో రైతు ఆత్మహత్య

ఇమ్యూనిటీ ఫుడ్ ఇస్తలే.. గాంధీలో కరోనా పేషెంట్ల ఆవేదన

జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో అమర్ జవాన్ జ్యోతి విలీనం