గాంధీలో కరోనా డెడ్‌‌ బాడీలు తారుమారు

గాంధీలో కరోనా డెడ్‌‌ బాడీలు తారుమారు

బంధువులకు అప్పగించడంలో సిబ్బంది నిర్లక్ష్యం
శ్మశానంలో గుర్తించి తిరిగి గాంధీ హాస్పిటల్‌కు తరలింపు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్‌లో చనిపోయిన కరోనా పేషెంట్ల డెడ్ బాడీలు తారుమారయ్యాయి. ఓ వ్యక్తి బంధువులు శ్మశానం దాకా తీసుకెళ్లాక ఈ తప్పును గుర్తించారు. ఆ బాడీని గాంధీ హాస్పిటల్‌కు తీసుకొచ్చేశారు. తర్వాత అధికారులు వాళ్లకు సంబంధించి వ్యక్తి డెడ్ బాడీని గుర్తించారు. హైదరాబాద్‌లోని బేగంపేట గురుమూర్తినగర్‌కు చెందిన ఓ కరోనా పేషేంట్ (48) మంగళవారం గాంధీలో చనిపోయారు. హాస్పిటల్ స్టాఫ్ డెడ్ బాడీని బంధువులకు అప్పగించగా.. వాళ్లు శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆ వ్యక్తి భార్య డెడ్ బాడీని తన భర్తది కాదని గుర్తించింది. దాంతో బాడీని తిరిగి అంబులెన్స్​లో గాంధీ హాస్పిటల్ మార్చురీకి తీసుకొచ్చారు. డాక్టర్లు, హెల్త్​ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మార్చురీలో వాళ్లకు సంబంధించిన వ్యక్తి బాడీని గుర్తించడంతో శాంతించారు. బుధవారం ఉదయం అప్పగిస్తామని డాక్టర్లు చెప్పడంతో వెళ్లిపోయారు. గాంధీ హాస్పిటల్‌కు భారీగా కరోనా పేషెంట్లు వస్తుండటంతో.. డాక్టర్లు, స్టాఫ్ పై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని, ఆ క్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని అంటున్నారు.

For More News..

హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు

సెకెండ్ హ్యాండ్‌ కార్లకు ఫుల్​ గిరాకీ

మరో పది రోజుల్లో టెన్త్ రిజల్ట్స్