25 లక్షలు దాటిన కరోనా మరణాలు

25 లక్షలు దాటిన కరోనా మరణాలు
  • కరోనా మరణాలు 25 లక్షలు
  • అమెరికాలోనే 8 లక్షల మంది
  • మన దేశంలో 1.5 లక్షల మంది వైరస్‌‌‌‌కు బలి 

పారిస్‌‌‌‌: కరోనా మరణాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌‌‌‌తో చనిపోయిన వాళ్ల సంఖ్య తాజాగా 25 లక్షలు దాటింది. గురువారం మధ్యాహ్నానికి 25,01,626 మంది మృతి చెందినట్టు అమెరికాలోని జాన్​ హాప్‌‌‌‌కిన్స్ వర్సిటీకి చెందిన సెంటర్‌‌‌‌ ఫర్‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌ సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌ వెల్లడించింది. ఇప్పటివరకు 11 కోట్ల 26 లక్షల మంది వైరస్‌‌‌‌ బారిన పడ్డారంది. కరోనా మరణాల్లో ఎక్కువగా యూరప్‌‌‌‌ ప్రాంతంలోనే నమోదయ్యాయని.. అక్కడ 8,42,894 మంది మృతి చెందారని చెప్పింది. దేశాలవారీగా అత్యధికంగా అమెరికాలో 5,06,232 మంది చనిపోయారంది. ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్‌‌‌‌(2,49,957), మెక్సికో (1,82,815), ఇండియా(1,56,705), బ్రిటన్‌‌‌‌ (1,22,070) ఉన్నాయని తెలిపింది. చైనాలో తొలి మరణం నమోదైనప్పటి నుంచి 10 లక్షల మరణాలకు చేరడానికి దాదాపు 9 నెలల టైమ్‌‌‌‌ పట్టిందని, కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌ 28 నాటికి 10 లక్షల మంది వైరస్‌‌‌‌తో మరణించారని వర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు.