భారీగా తగ్గిన చికెన్ ధరలు

 భారీగా తగ్గిన చికెన్ ధరలు

హైదరాబాద్: రాష్ట్రంలో చికెన్ ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. రేట్లు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తో ఫంక్షన్లు,  పెళ్లిళ్లు వాయిదా  పడడం.. ఇంకో వైపు నైట్ కర్ఫ్యూ విధిస్తుండడం వల్ల హోటళ్లు తొందరగా మూసేయాల్సి రావడంతో ధరలు భారీగా పడిపోయాంటున్నారు వ్యాపారులు.
అమాంతం పడిపోయిన చికెన్ ధర
చికెన్ ధర అమాంతం తగ్గింది. ఏప్రిల్ 1వరకు కిలో చికెన్ ధర 300 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్ లో 180కి పడిపోయింది. కేవలం నెల రోజుల్లో వంద రూపాయలకుపైగా తగ్గింది. గతేడాది ఇదే సమయంలో కిలో 250 ఉంది. చికెన్ ధరలు తగ్గడంతో కొనేందుకు క్యూ కడుతున్నారు నాన్ వెజ్ ప్రియులు. రాష్ట్రంలో రోజుకి సగటున 9 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి.  ప్రస్తుతం రోజుకు 5 లక్షల కిలోలకు మించి అమ్ముడు పోవడం లేదంటున్నారు వ్యాపారులు. నైట్ కర్ఫ్యూతో అమ్మకాలు తగ్గిపోయంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో ఫంక్షన్లు, పెళ్లిళ్లు సభలు, సమావేశాలు లేకుండాపోయాయి. దీంతో  చికెన్ అమ్మకాలు తగ్గాయంటున్నారు వ్యాపారులు.