కరోనా ఎఫెక్ట్: ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వ కీలక నిర్ణయం

కరోనా ఎఫెక్ట్: ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వ కీలక నిర్ణయం

రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానుతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్టైంది. అన్ని సౌకర్యాలు చేపట్టింది. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేసింది. విద్యార్థులు మాస్కులను ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు వారు తమ సొంత వాటర్ బాటిల్ ను పరీక్షా హాల్ లోకి తీసుకుని రావచ్చన్నారు.

మరోవైపు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న విద్యార్థులను విడిగా మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు. దీనిపై అక్కడి ఇన్ చార్జ్, ఇన్విజిలేటర్లు సొంతంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.