
కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఒక్కసారిగా ఊహించని స్థాయిలో ప్రభావం పడడంతో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. ఇవాళ తాజాగా మహారాష్ట్ర సర్కారు కూడా అదే బాటలో నిర్ణయం తీసుకుంది. సీఎం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల నుంచి గ్రేడ్ – C ఉద్యోగుల వరకు అందరికీ మార్చి నెల జీతాల్లో కోత పెట్టబోతున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్.
జీతంలో కోతల శాతం ఇలా
- సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిదుల జీతంలో 60 శాతం కటింగ్.
- గ్రేడ్ – A, గ్రేడ్ – B అధికారుల జీతాల్లో 50 శాతం కోత.
- గ్రేడ్ – C ఉద్యోగుల జీతాల్లో 25 శాతం తగ్గింపు.
- గ్రేడ్ – D ఉద్యోగులకు మాత్రం జీతం నుంచి ఎటువంటి కోతలు లేకుండా పూర్తిగా చెల్లిస్తామని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
Salaries of Grade A and B officers will be deducted by 50% and that of Grade C employees, by 25%. No deduction in the salary of Grade D employees: Maharashtra Deputy CM and state Finance Minister Ajit Pawar #Coronavirus https://t.co/lT02KFzoAT
— ANI (@ANI) March 31, 2020