హైదరాబాద్ బుక్ ఫెయిర్ పై కరోనా ప్రభావం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ పై కరోనా ప్రభావం

హైదరాబాద్ : నగరంలోని L.B స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. కరోనా ఎఫెక్ట్ తో రెండేళ్ళ తర్వాత బుక్ ఫెయిర్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది కూడా బుక్ స్టాల్స్ సంఖ్యపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఏటా 300కు పైగా బుక్ స్టాల్స్ ఫెయిర్ లో ఉండేవి. కానీ ఈ ఏడాది మాత్రం 250 స్టాల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. రేర్ బుక్స్ కూడా ఫెయిర్ లో దొరుకుతున్నాయంటున్నారు పుస్తక ప్రియులు.