క‌రోనా ఎఫెక్ట్: ఉద్యోగుల జీతాల్లో కోత‌

క‌రోనా ఎఫెక్ట్: ఉద్యోగుల జీతాల్లో కోత‌

క‌రోనా వైర‌స్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ప‌డ‌డంతో తెలంగాణ‌ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశంలో జరిగింది. చ‌ట్ట స‌భ్యులు మొద‌లు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్ష‌న్ల వ‌ర‌కు కోత విధించాల‌ని ఈ భేటీలో నిర్ణయించిన‌ట్లు సీఎం కార్యాల‌యం వెల్ల‌డించింది.

జీతంలో కోత‌లు ఇలా..

  • ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత
  • ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత
  • మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం త‌గ్గింపు
  • నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కుదించి చెల్లింపులు
  • అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం క‌టింగ్
  • నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల‌లో 10 శాతం కోత
  • అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత ఉంటుంద‌ని సీఎంవో ప్ర‌క‌టించింది.