ఏపీలో కరోనా తొలి మరణం

ఏపీలో కరోనా తొలి మరణం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దెబ్బకి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 72 మంది చనిపోయారు. తాజాగా ఏపీలో కరోనా తొలి మరణం నమోదయింది. విజయవాడ కుమ్మరిపాలెంకు చెందిన షేక్ సుభానీ అనే 55 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి మరణించాడు. మృతుని కొడుకు ఈ మధ్యే ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చాడు. కొడుకు నుంచి మృతునికి కరోనా సోకినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి స్థానికంగా ఉండే మరో 25 మందిని కూడా క్వారంటైన్ కు తరలించినట్లు సమాచారం.

కాగా.. ఏపీ నుంచి ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వాళ్లలో 108 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తేల్చింది. మొత్తంగా ఏపీ నుంచి 1805 మంది నిజాముద్దీన్ కు వెళ్లినట్లు గుర్తించారు. అందులో 881 మందికి పరీక్షలు నిర్వహించగా.. 108 మందికి పాజిటివ్ గా తేలింది. అంతేకాకుండా జమాతే వెళ్లిన వారికి చెందిన 605 కుటుంబ సభ్యులను పరీక్షించగా.. 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో మొత్తం 161 కేసులు నమోదుకాగా.. అందులో 140 కేసులు జమాతే వెళ్లి వచ్చిన వారేనని తేలింది.

For More News..

ఒవైసీ హాస్పిటల్‌‌ను ఐసోలేషన్ వార్డు ఎందుకు చేయరు?

దేశంలో 42 కరోనా హాట్ స్పాట్లను గుర్తించిన కేంద్రం

కరోనా పేషంట్లను గుర్తించే యాప్.. మీరు కూడా చెక్ చేయోచ్చు…

ఏపీకి అరబిందో ఫార్మా భారీ సాయం

ట్విన్స్ నామకరణం: పాపకు కరోనా.. బాబుకు కోవిడ్..