పేరెంట్స్ నుంచి పిల్లలకు కరోనా

పేరెంట్స్ నుంచి పిల్లలకు కరోనా

లక్షణాలు కనిపిస్తే  పీడియా ట్రిషియన్​ను కన్సల్ట్  కావాలంటున్న డాక్టర్లు
హైదరాబాద్,వెలుగు: సెకండ్​వేవ్​లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే మిగతా కుటుంబసభ్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఎదుగుతున్న పిల్లల వరకు ఎవరూ వైరస్ కి మినహాయింపు కాదని సిటీకి చెందిన పీడియాట్రిషియన్లు  అంటున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పేరెంట్స్ నుంచి ఇంట్లోని చిన్నారులకు వైరస్ అటాక్ అయ్యే చాన్స్ ఉందంటున్నారు.

అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. బాలింతకు పాజిటివ్ ఉంటే 90 శాతం బిడ్డకు కూడా వైరస్ సోకుతుందంటున్నారు. అందుకే డెలివరీ టైమ్ లో బిడ్డను సెపరేట్ చేసి ఎన్ఐసీయూ (న్యూ బార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) లో పెట్టి మొదటి 5 రోజులు అందులోనే ఉంచుతున్నామన్నారు. టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చాక తల్లీబిడ్డను ఒకచోట ఉంచుతున్నామని చెప్తున్నారు. ఐదేండ్లు దాటిన పిల్లలకు కరోనా వస్తే  టేస్టు, స్మెల్ పోతుందని, ఈ లక్షణాల ద్వారా వారికి వైరస్ అటాక్ అయినట్లు గుర్తించాలంటున్నారు. వారు తినడం మానేయడంతో పాటు నిద్రలో లేచి ఏడుస్తారని అలాంటప్పుడు వెంటనే పీడియాట్రిషియన్​ని సంప్రదించాలంటున్నారు. 

 అబ్జర్వేషన్ తప్పనిసరి..

కరోనా సోకిన పిల్లలను ఇంట్లోనే ఓ రూమ్​లో హోం ఐసోలేట్ చేసి వారికి కావాల్సిన అన్ని వస్తువులను ఆరేంజ్ చేయాలి. పేరెంట్స్ ఎప్పటికప్పుడు వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లలకు సైతం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం కంటే తక్కువగా ఉన్నా.. లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్​ దగ్గరకు తీసుకువెళ్లాలి. 


టెన్షన్ పడొద్దు..  

సెకండ్ వేవ్ లో పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తమ పిల్లలకు కరోనా లక్షణాలున్నాయనే టెన్షన్​తోనే చాలామంది పేరెంట్స్ మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు. అలాంటి వాళ్లకు ఆన్ లైన్ కన్సల్టేషన్ ఇస్తున్నాం. హోం క్వారంటైన్​లో ఉంటోన్న పిల్లలను సైతం మార్నింగ్, ఈవెనింగ్ వీడియో కాల్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నాం. పిల్లల బిహేవియర్, వాళ్లు ఉంటున్న తీరు, తీసుకునే ఫుడ్​ను పేరెంట్స్ గమనించాలి. పోస్ట్ కొవిడ్​తో చిన్నారులు హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అందుకే వారి హెల్త్ పట్ల పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రాబ్లమ్ ఉంటే పీడియాట్రిషియన్​ను కన్సల్ట్
 కావాలి.  ‌‌- డా. వి. అపర్ణ, కన్సల్టెంట్, పీడియాట్రిషియన్​