రాబోయే రోజుల్లో అందరికీ కరోనా రావచ్చు: సీఎం జగన్

రాబోయే రోజుల్లో అందరికీ కరోనా రావచ్చు: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 38,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 492 మంది మరణించారు. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న రోజుల్లో కరోనా సోకని వ్యక్తి ఉండకపోవచ్చన్నారు సీఎం జగన్. కరోనా సోకినా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే 85 శాతం ఇంటి దగ్గరనే కోలుకోవచ్చన్నారు. పొరుగున ఉన్న రాష్ట్రాలు సరిహద్దులను తెరిచి ఉంచాయని, ఎవరి రాకపోకలనూ మనం కట్టడి చేయలేమన్నారు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పారు జగన్.