వైరల్ ఆడియో: గాంధీలో అన్నీ ఇస్తున్నామన్న కేసీఆర్.. ఇప్పుడేమంటారో?

వైరల్ ఆడియో: గాంధీలో అన్నీ ఇస్తున్నామన్న కేసీఆర్.. ఇప్పుడేమంటారో?

కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో రోజురోజుకు పెరుగుతూ ఉంది. రాష్ట్రంలో కరోనా సోకిన వారిని గాంధీకి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే అక్కడ మెరుగైన వైద్యం అందించడంలేదని కరోనా బాధితులు వాపోతున్నారు. బాధితులు తమ గోడును ఆడియోలు, వీడియోల రూపంలో రిలీజ్ చేస్తున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. అయితే గత వారం రోజుల నుంచి మీడియా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడటంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ మెరుగైన వసతులు లేవంటూ మీడియా ప్రతినిధులు కూడా తమ బాధను ఆడియోల రూపంలో విడుదల చేస్తున్నారు. తాజాగా ముగ్గురు మీడియా ప్రతినిధులకు కరోనా సోకడంతో గాంధీకి తరలించారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒక పేషంట్ పంపిన ఆడియో వింటే బతికుంటే గాంధీకి వెళ్లొద్దు అనేలా ఉంది అక్కడి పరిస్థితి.

మర్కజ్ లింకులు బయటపడిన సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా పేషంట్ల కోసం కాంప్రమైజ్ కాకుండా ఖర్చుపెడుతున్నామన్నారు. వారు ఏది అడిగితే అది తెచ్చి పెడుతున్నామన్నారు. పేషంట్ల రోగ నిరోధక శక్తి పెంచడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మరి అలాంటిది ఇప్పడు కరోనా రోగులకు కనీసం మంచినీళ్లు, ఆహారం కూడా ఇవ్వడంలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. పేషంట్ పంపిన ఆడియో మీకోసం..

‘మేం నిన్నటి నుంచి ఏం తినలేదు. మాకు తినడానికి ఏం ఇవ్వలేదు. ఆకలవుతుందని చెప్పినా పట్టించుకోలేదు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. మేం నిన్న లోపలికి వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. వాటితోనే రాత్రంతా సరిపెట్టుకున్నాం. ఇక డాక్టర్లయితే నిన్నటి నుంచి అసలు రానేరాలేదు. మేం నిన్న సాయంత్రం హాస్పిటల్‌కు వస్తే ఇప్పటివరకు ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు. నిన్న సాయంత్రం మేం వచ్చినప్పడు ఇవి మీరు పడుకునే బెడ్లు అని చెప్పి వెళ్లారు. అప్పటినుంచి ఇక్కడే ఉన్నాం. మేం ఇక్కడ మూడు చానెళ్లకు చెందినవాళ్లం ఉన్నాం. డోర్ కొట్టి మరీ ఫుడ్ అడిగితే.. సరే సరే అంటున్నారు తప్ప ఏం ఇవ్వడం లేదు. ఈ వార్డులో దాదాపు 15 మంది ఉన్నాం. అందరికీ కలిపి 3 వాష్ రూమ్స్ ఉన్నాయి. వాటిని క్లీన్ చేస్తారో లేదో కూడా తెలియదు. అసలు ఇక్కడ మంచినీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదు’అని ఆవేదన వ్యక్తం చేశాడు.

రిపోర్టర్ మనోజ్ మరణం గురించి మరువక ముందే మరో ఆడియో బయటకు రావడంతో అసలు ఆస్పత్రిలో ఏం జరగుతుంది అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది.

For More News..

విజయవాడలో మళ్లీ లాక్డౌన్

హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు

సెకెండ్ హ్యాండ్‌ కార్లకు ఫుల్​ గిరాకీ

మరో పది రోజుల్లో టెన్త్ రిజల్ట్స్