ఊర్లో ఉండనీయలే..దవాఖానలో చేర్చుకోలే..కరోనా పేషెంట్ సూసైడ్

ఊర్లో ఉండనీయలే..దవాఖానలో చేర్చుకోలే..కరోనా పేషెంట్ సూసైడ్
  • పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్లో ఉండాలన్న డాక్టర్లు
  • ఇంటికొస్తే ఊర్లో ఎలా ఉంటాడంటూ అడ్డుకున్న లోకల్ జనం
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషెంట్ మెదక్ జిల్లా కూచన్ పల్లిలో ఘటన

మెదక్, వెలుగు: కరోనా పేషెంట్ అని ఊర్లోఉండనివ్వలేదు. మైల్డ్సింప్టమ్స్ అని ఆస్పత్రిలో చేర్చుకోలేదు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా కూచన్ పల్లి గ్రామంలో ఈ ఘట న జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మన్నె యాదగిరి(42) నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రాక్టర్  సూపర్ వైజర్ గా  పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా కామారెడ్డిప్రభుత్వాసుపత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. పాజిటివ్ అని రిపోర్టు రావడంతో డాక్టర్ సూచ నమేరకు కూచన్ పల్లికి వచ్చి హోం ఐసోలేషన్లో ఉన్నాడు. విషయం తెలుసుకున్నగ్రామస్తులు తమకూ వైరస్ సోకుతుందనే భయంతో యాదగిరిని గ్రామం నుంచి పంపేసే ప్రయత్నం చేశారు. ఆదివారం అంబులెన్స్లో మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..అక్కడ యాదగిరిని పరీక్షించిన డాక్టర్0 హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదని, హోం ఐసోలేషన్లో ఉండి మెడిసిన్స్  వాడుతూ.. జాగ్రత్తలు పాటిస్తే సరి పోతుందని చెప్పారు. యాదగిరి తిరిగి ఇంటికి రాగా,కరోనా వచ్చిన వ్యక్తి ఊర్లోఎలా ఉంటాడంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన యాదగిరి ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. సోమవారం రెవెన్యూ, మెడికల్, హెల్త్, పోలీసు ఆఫీసర్లు కరోనా గైడ్లైన్స్ ప్రకారం యాదగిరి మృత దేహాన్ని ఖననం చేయించారు.