1.5 లక్షలకు దిగువన కరోనా పాజిటివ్ కేసులు

1.5 లక్షలకు దిగువన కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో రెండవ విడత కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతంలో రోజూ మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. కానీ.. గత వారం రోజుల నుంచి రోజూవారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా దేశంలో 1.5 లక్షలకు దిగువన రోజువారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా.... మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా నమోదయిన కరోనా మరణాల సంఖ్య మూడు వేలకు చేరువలో ఉంది.  

గత 24 గంటలలో 1,34,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్ల 84 లక్షల 41 వేల 986 దాటింది. అదేవిధంగా కరోనా వల్ల గడిచిన 24 గంటల వ్యవధిలో 2,887 మంది మృతిచెందారు. దాంతో ఇప్పటివరకు కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 3,37,989కి చేరింది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 2,11,499గా నమోదైంది. దాంతో ఇప్పటివరకు కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,63,90,584కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,13,413 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో నమోదైన కరోనా రోగుల రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. అదేవిధంగా యాక్టివ్ కేసుల శాతం 6.34 శాతంగానూ, మరణాల రేటు 1.18 శాతంగానూ నమోదైంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 24,26,265 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 21,59,873గా నమోదైంది.