
బాలీవుడ్ ప్రముఖ నటి, రాజకీయ వేత్త ఊర్మిళ మటోండ్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. వైద్యపరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఎటుంటి లక్షణాలు కనిపించలేదని, గృహ నిర్బంధంలో ఉన్నట్లు ఊర్మిళ చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.