
విశాఖపట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగరానికి చెందిన ముగ్గురు ఆదివారం వైరస్ బారినపడ్డారు. వీరిలో మహిళా హోం గార్డు కూడా ఉన్నారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె నివసించే కొబ్బరితోట ప్రాంతంలో కలకలం మొదలైంది. అలాగే, ఆమె పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
కరోనా సోకిన మహిళా హోం గార్డును గీతం ఆస్పత్రికి తరలించగా, ఆమె తండ్రి, సోదరిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా బారినపడిన మిగతా ఇద్దరిలో ఒకరు దండుబజార్‌కు చెందిన మహిళ కాగా, మరొకరు గాజువాక ప్రియదర్శిని కాలనీ వాసి.