దేశంలో 8 కోట్లు దాటిన కరోనా టెస్టులు

దేశంలో 8 కోట్లు దాటిన కరోనా టెస్టులు

దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 8 కోట్లు దాటింది. నిన్న ఒక్కరోజే 10,89,403 టెస్టులు చేశారు. దీంతో దేశంలో అక్టోబర్ 5 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 8,10,71,797 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది. కరోనా కేసులు కూడా కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి రోజు 90 వేల కేసులు నమోదయ్యేవి. ఇపుడు గత కొన్ని రోజులుగా  దాదాపు 70 వేల కేసులు నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో 61,267 కేసులు నమోదవ్వగా ..884 మంది చనిపోయారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,083 కు చేరగా మరణాల సంఖ్య 1,03,569 కు చేరింది. నిన్న ఒక్కరోజే 75,787 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు  దేశంలో 56,62,491 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 9,19,203 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.