దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా  తాజాగా 636 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 394కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనా తో ముగ్గురు మరణించారు. కేరళలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 


గత వారంలో రోజుల కరోనా కేసులను పరిశీలిస్తే రోజురోజుకు కరోనా కేసులు క్రమంగా పెపెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ప్రస్తుత ఎన్ ఫెక్షన్ కేసులకు ప్రధాన కారణం కొత్త వేరియంట్ JN.1  అని డాక్టర్లు అంటున్నారు. అయితే ఇటీవల నమోదు అయిన కరోనా కేసుల్లో అత్యంత తీవ్ర ప్రభావం చూపేవి కావని... రోగులు త్వరగా కోలుకుంటున్నారని చెబుతున్నారు. చాలా మందిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 

ఈ క్రమంలో కరోనా కొత్త  కేసులు పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. 2019లో మొదలైన కరోనా.. ఇంకా దేశాన్ని విడిచి పోలేదని.. దాని ప్రభావం ఇంకా ఉందని అంటున్నారు. నాలుగేళ్లు గా దేశవ్యాప్తంగా 4.5 కోట్లు మంది కరోనా బారిని పడ్డారు.  5.3 లక్షల మందికి పైగా చనిపోయారు.