coronavirus : గడిచిన 24 గంటల్లో 1,805 కరోనా కేసులు

coronavirus : గడిచిన 24  గంటల్లో 1,805  కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా (coronavirus)  కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో యాభై ఆరు వేలకు పైగా టెస్టులు చేయగా పద్దెనిమిది వందల తొంబై ఐదు కేసులు బయటపడ్డాయి.   ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య  పదివేల మార్క్ ను దాటింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనాతో చనిపోగా, తొమ్మిది వందల ముప్పై రెండు మంది కరోనా నుంచి కొలుకున్నారు.

తాజాగా పెరిగిన కేసులతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలకు చేరుకుంది.  గతేడాది నవంబర్ లో యాక్టివ్ కేసుల సంఖ్య  పదివేల కిందికి పడిపోయింది. మళ్లీ అప్పటినుంచి పెరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  తెలిపింది.

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్రం( central Government ) అలర్ట్ అయింది. రాబోయే రోజుల్లో వైరస్ ను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని, కరోనా హాట్ స్పాట్ లను గుర్తించి, వైరస్ కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.